Breaking News

‘పార్లమెంట్‌ భద్రత.. ప్రభుత్వ బాధ్యత కాదు’

Published on Fri, 12/15/2023 - 17:30

ఢిల్లీ:  పార్లమెంట్‌ భద్రత వైఫల్యంపై విపక్షాలు పార్లమెంట్‌లో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రధానమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి జవాబు చెప్పాలని పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం 13 మంది లోక్‌ సభ సభ్యులు, రాజ్యసభలో ఒక ఎంపీ సస్పెన్షన్‌కు గురైనారు. అయితే తాజాగా విపక్షాల  ఆందోళనలపై బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్‌ భద్రతా వైఫల్యాలు 1974, 1994లో కూడా  చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పడు జరిగింది తొలిసారి కాదని అన్నారు. పార్లమెంట్‌ భద్రత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత కాదని అన్నారు. పార్లమెంట్‌ భద్రత వైఫల్యంపై ప్రధాని, కేంద్ర హోం మంత్రి మాట్లాడమని విపక్షాలు ఆందోళన చేయడం సరికాదని మండిపడ్డారు. పార్లమెంట్‌ భద్రతా వ్యవహారం మొత్తం లోక్‌సభ సెక్యూరిటీకి సంబంధించిందని అన్నారు.

1974లో అయితే ఏకంగా ఓ వ్యక్తి రెండు తుపాకులు చేతిలో పట్టుకొని పార్లమెంట్‌లోకి వచ్చాడని తెలిపారు. కానీ, ఆనాటీ ప్రతిపక్షమైన జనసంఘ్‌ దాన్ని ఓ పెద్ద వివాదంగా చేయలేదని అన్నారు. ప్రధాన మంత్రి, హోం మంత్రి బాధ్యత వహించాలని నిరసనలు తెలపలేదని అన్నారు. ఎందుకుంటే పార్లమెంట్‌ భద్రత.. బాధ్యత లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెందినదని ఆయన ‘ఎక్స్‌’ ట్విటర్‌లో పేర్కొన్నారు.

చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)