Breaking News

‘నేను కమిషన్‌ దగ్గరకు దోషిగా వెళ్లలేదు.. సాక్షిగా వెళ్లాను’

Published on Sun, 06/08/2025 - 21:31

హైదరాబాద్‌: తానే కాళేశ్వరం కమిషన్‌ ముందుకు దోషిగా వెళ్లలేదని, సాక్షిగా మాత్రమే వెళ్లానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను ఆర్థిక మంత్రిగా ఉండటంతో తప్పకుండా విచారణకు హాజరుకావాలని పిలిస్తే కమిషన్‌ ముందుకు సాక్షిగా వెళ్లానన్నారు. బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈటల. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

‘నన్ను కమిషన్‌ పిలిచింది.. కమిషన్‌ కూడా సాక్షిగా రమ్మని పిలిచింది తప్ప దోషిగా పిలవలేదు. నేను తప్పకుండా వస్తాను. మా పార్టీ ,కమిషన్ మీద నమ్మకం ఉన్న పార్టీ అని చెప్పి  వెళ్లాను. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అనే కోరుకునే పార్టీ మాది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎక్కడ వెతికినా ఒక్క స్కాం కూడా కనపడదు.  కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ. సొంత మంత్రులే జైలుకు పోయారు.

కాలేశ్వరం ప్రాజెక్టులో అనేక తప్పులు..  ఎన్నో డీవియేషన్ జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నీకు నీతి నిజాయితీ ఉంటే కమిషన్ రిపోర్ట్ ను బయట పెట్టండి, మీకు చేతకాకపోతే సిబిఐ కి అప్పగించండి దోషులకు శిక్ష పడేలా చేస్తాము. ఇప్పుడున్న కమిషన్‌ను ఆరుసార్లు పొడిగించారు... దోషులను బయట పెట్టకపోతే నీకు శిక్ష తప్పదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు మన మీద మాటల దాడి చేస్తారు.  ఈ ఆరోపణలను, దాడులను తిప్పి కొట్టే సత్తా బీజేపీ కార్యకర్తలకు ఉండాలి’ అని ఈటల పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)