ఆవేశంలో ఉన్నా ఆలోచించి మాట్లాడాలి.. సురేఖకు డీకే అరుణ చురకలు

Published on Fri, 10/04/2024 - 19:23

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని కొండా సురేఖకు హితవు పలికారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఆవేశం వచ్చినా రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి, ఎంపీ డీకే అరుణ శుక్రవారం చార్మినార్‌ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ క్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ.. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పనిచేశాం. కానీ, ఒక సినీ కుటుంబంపై ఆమె చేసిన ఆరోపణలు అభ్యంతరకరం. సినిమా పరిశ్రమలో ఆ కుటుంబానికి ప్రత్యేక పేరు ఉంది. ఎవరి వ్యక్తిగత విషయాలతో రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఒకసారి మాట్లాడి మళ్లీ వెనక్కు  తీసుకోలేము. రాజకీయ నాయకులు ఆవేశం వచ్చినా ఆలోచించి మాట్లాడాలి. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద తీయడం సరికాదు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి రేవంత్ ప్రభుత్వం గురికావద్దు. అమ్మవారి ఆలయం దగ్గర మహిళలు బతుకమ్మ ఆడటానికి కోర్ట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో మళ్లీ నియంతృత్వ పాలనా సాగుతుంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ఎన్నికల హామీలు విఫలమై హైడ్రా.. చివరకు సినీ తారలు: జగదీష్‌ రెడ్డి

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)