Breaking News

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

Published on Sat, 01/11/2025 - 05:12

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో ఎన్నికలు జరగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తన అభ్య ర్థులను ప్రకటించింది. కరీంనగర్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ – మెదక్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి, ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య, నల్లగొండ–వరంగల్‌–ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సరోత్తమ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా ఆదేశాల మేరకు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

సి.అంజిరెడ్డి: ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని రామచంద్రాపురానికి (ప్రస్తుతం సంగారెడ్డి) చెందిన సి.అంజిరెడ్డి డిగ్రీ పూర్తి చేశారు. పారిశ్రామికవేత్తగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలకు దగ్గరయ్యారు. రెండు దశాబ్దాలుగా ఆయన ఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ద్వారా పలు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పేద విద్యార్థులు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా ట్రస్ట్‌ ద్వారా సహకారం అందిస్తున్నారు. అంజిరెడ్డి భార్య గోదావరి అంజిరెడ్డి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

మల్క కొమురయ్య: కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లికి చెందిన కొమురయ్య ఉస్మానియా వర్సిటీ నుంచి బీఈ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఆయన పలు విద్యాసంస్థలను నెలకొల్పారు. పాఠశాల స్థాయిలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్‌లలో పలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పల్లవి గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూట్స్‌ చైర్మన్‌గా ఉన్నారు. 

పులి సరోత్తమ్‌రెడ్డి: వరంగల్‌కు చెందిన సరోత్తమ్‌రెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 21 ఏళ్లపాటు స్కూల్‌ అసిస్టెంట్‌గా, పదేళ్లు హెడ్‌మాస్టర్‌గానూ సేవలందించారు. 2012 నుంచి 2019 దాకా పీఆర్‌టీయూకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. టీచర్స్‌ జేఏసీలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా, యూనియన్‌ నాయకుడిగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)