Breaking News

నేను బీజేపీకి అవసరం లేదనుకుంటా?: రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 02/14/2025 - 13:36

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. బీజేపీ హైకమాండ్‌ నిర్ణయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, బీజేపీలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారింది.

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఓ వీడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌.. పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నాను. దీని కంటే బయటికి వెళ్లడమే కరెక్ట్ అనుకుంటా. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ వ్యక్తికి ఇవ్వాలని నేను సూచించాను. నేను చెప్పిన పేరు కాకుండా వేరే పేరు ఇవ్వడం ఏంటి?. కానీ, ఎంఐఎం పార్టీతో తిరిగే నాయకుడికి ఇచ్చారు. పార్టీకి నా అవసరం లేదనుకుంటా?. ముందు ముందు ఏమవుతుందో చూద్దాం. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇలాంటి రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదు.  పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారు. తన సూచనను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇక, ఇదే సమయంలో.. ఈ విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారు. దీనిని బట్టి చూస్తే పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని అర్థం అవుతుందంటూ రాజాసింగ్ వివరించారు. తాను ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

Videos

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)