Breaking News

అంతర్గత విబేధాలు.. సైలెంట్‌ మోడ్‌లోకి ఎమ్మెల్యే రఘునందన్‌ రావు

Published on Thu, 06/29/2023 - 18:51

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్ని రోజులు ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ, అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. పార్టీలోని కీలక నేతల్లో అసంతృప్తి పతాకస్థాయికి చేరింది. రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై పలువురు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. బండి సంజయ్‌కు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మధ్య పొసగటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమంటూ ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్‌ దుమారం రేపుతోంది.

తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యే సైలెండ్‌ మోడ్‌లోకి వెళ్లారు. ఆయనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. ఆయన ఈ మధ్య పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర నాయకత్వానికి, రఘునందన్‌ రావుకు మధ్య గ్యాప్‌ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్న రఘునందన్‌ రావు.. ఇదే విషయంపై ఇటీవల జేపీ నడ్డాకు  ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మరోవైపు తెలంగాణ బీజేపీపై హైకమాండ్‌ ఫోకస్ పెట్టింది. దీంతో పార్టీ నాయకత్వంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌‌ను అధిష్ఠానం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. బండిని ఆ పదవి నుంచి మార్చేసి.. కేంద్రమంత్రి బాధ్యతలు ఇవ్వనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. బండి సంజయ్‌ను తప్పిస్తే.. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వనున్నారన్నది ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)