Breaking News

బీఆర్‌ఎస్‌తో పొత్తు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 02/19/2024 - 12:29

సాక్షి,ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ తెరదించారు. ఢిల్లీలో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కాళ్ల బేరానికి వచ్చినా ఆ పార్టీతో పొత్తు ఉండదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటరీ బోర్డు సభ్యుని హోదాలో చెబుతున్నానన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. 

బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ అని, బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని లక్ష్మణ్‌ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రహస్య ఒప్పందం చేసుకున్నాయన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కవిత కేసులో విచారణ జరుగుతోందన్నారు. ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 

17 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది : కిషన్‌రెడ్డి 

రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ తెలంగాణ చీఫ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ విజయసంకల్ప యాత్రలు మంగళవారం నుంచి ప్రారంభమవనున్న సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్‌ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. యాత్ర రథాలను స్వయంగా నడిపారు. 

అనంతరం మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తాం. 20 నుంచి మార్చి 2 వరకు విజయ సంకల్ప యాత్రలు జరుగుతాయి. సమిష్టి నాయకత్వంలో, పార్టీ జెండా కింద యాత్రలు కొనసాగుతాయి. యాత్రల్లో భాగంగా రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లు ఉంటాయి.  అన్ని సామాజిక వర్గాలను కలుస్తాం. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో సైతం బీజేపీ గెలవడం ఖాయం’ అని చెప్పారు. 

ఇదీ చదవండి.. ఆ ఎంపీ స్థానం నుంచే పోటీ.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)