Breaking News

Cantonment: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత

Published on Wed, 03/20/2024 - 07:52

హైదరాబాద్‌: ఎన్నికల వేళ కంటోన్మెంట్‌లో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఎన్‌.శ్రీగణేశ్‌ కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ సమక్షంలో మంగళవారం ఆయన కాంగ్రెస్‌ పారీ్టలో చేరారు. కాగా శ్రీగణేశ్‌ మంగళవారం ఉదయం బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి మారేడుపల్లి నెహ్రూనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారి్నంగ్‌ వాకర్స్‌తోనూ ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి బీజేపీ తరఫున శ్రీగణేశ్‌ బరిలో ఉంటారని వక్తలు పేర్కొన్నారు.

 అటు నుంచి శ్రీగణేశ్‌ నేరుగా పికెట్‌లోని తన కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్‌ రెడ్డిలు శ్రీగణేశ్‌ను కలిశారు. కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా మైనంపల్లి హన్మంతరావు రెండు రోజులుగా ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఇక మంగళవారం నేరుగా కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో మాట్లాడించి, కాంగ్రెస్‌లో చేర్పించారు. ఉదయం 11.00 గంటల వరకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేశ్‌ మధ్యాహ్నం 2.00 గంటలకు కాంగ్రెస్‌లో చేరిపోవడం గమనార్హం. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)