Breaking News

పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్లారిటీ

Published on Thu, 10/05/2023 - 20:23

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ మార్పుపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను బీజేపీ పార్టీని వీడుతున్నట్టు సోషల్ మీడియాలో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం.. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు.

‘‘నా వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు. నా చుట్టూ ఉన్న సమాజం కోసం నా వంతు మంచి చేయాలనే లక్ష్యం తో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. సబ్బండ వర్గాలు  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు నన్నెంతో కలచివేశాయి. ప్రజా తెలంగాణ బదులు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్థితి దాపురించింది’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.

‘‘తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలను ముందుకు నడిపించే సత్తా మోదీ, అమిత్ షాకి ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశాను. నేనే కాదు ఇతర ముఖ్య నాయకులు ఎవరు బీజేపీని వీడరు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతాం’’ అంటూ కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.
చదవండి: ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారు.. బీఎల్‌ సంతోష్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)