కూటమిలో ఘర్షణ.. బీజేపీ నేతపై జేడీఎస్‌ ఎమ్మెల్యే విమర్శలు

Published on Tue, 03/26/2024 - 07:31

బెంగళూరు: లోకసభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ-జేడీఎస్‌ పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. సీట్ల పంపకం కూడా అయిపోయంది. అయితే తాజాగా ఇరు పార్టీల నేతల మధ్య  అసమ్మతి బయటపడింది. ఇరుపార్టీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రచార సమావేశంలో జేడీఎస్‌-బీజేపీ నేతల ఘర్షణ చోటు చేసుకుంది. సోమవారం జేడీఎస్‌ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప బీజేపీ నేత కొండజ్జి విశ్వనాథ్‌పై విమర్శలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటమికి కారణం కొండజ్జి విశ్వనాథ్‌ అని సమావేశంలో విమర్శలు చేయటంతో ఒక్కసారిగా కార్యకర్తల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

గతంలో జేడీఎస్‌లో ఉన్న విశ్వనాథ్‌ అనంతరం బీజేపీలో చేరారు. అయితే ఈ సమావేశంలో విశ్వనాథ్‌ మాట్లాడటానికి ప్రయత్నించగా బీజేపీ సీనియర్‌ నేత సోమన్న అడ్డుకున్నారు. ఇక.. జేడీఎస్‌ ఎమ్మెల్యే కృష్ణప్ప చేసిన  వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభించింది. కొంత సమయం తర్వాత ఇరు పార్టీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ సద్దుమణిగింది.

బీజేపీతో పొత్తులో భాగంగా జేడీఎస్‌.. హసన్‌, మాండ్య, కోలార్‌ లోక్‌సభ స్థానాలను బీజేపీ ఇచ్చింది.   మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు డా. మంజూనాథ్‌ బీజేపీ టికెట్‌ మీద బెంగళూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేష్‌ కుమార్‌ను పోటీలోకి దింపింది. పాత మైసూరు ప్రాంతంలో.. జేడీఎస్‌ పొత్తుతో బీజేపీ ఒక్కలిగ ఓటర్ల మద్దుతు పొందాలని భావిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)