ఈటల, కోమటిరెడ్డి ఎఫెక్ట్‌.. వెంటనే ఢిల్లీకి రావాలని కిషన్‌రెడ్డికి ఫోన్‌

Published on Sat, 06/24/2023 - 11:25

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై హైకమాండ్‌ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెంటనే ఢిల్లీకి రావాలని హైకమాండ్‌ నుంచి ఫోన్‌ రావడంతో ఆయన హస్తినకు బయలుదేరనున్నారు. దీంతో, హైదరాబాద్‌లో ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను సెట్‌ చేసే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. ఇందులో భాగంగానే కిషన్‌రెడ్డి ఢిల్లీ రావాలని ఫోన్‌ వచ్చింది. ఇక, అంతకుముందే రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిలో ఉన్న ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ఢిల్లీకి రావాలని సూచించడంతో ఇప్పటికే కోమటిరెడ్డి హస్తినకు వెళ్లారు. ఈటల కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, వీరిలో జేపీ నడ్డా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. జేపీ నడ్డా రేపు(ఆదివారం) తెలంగాణకు రానున్నారు. 

సంజయ్‌ సమక్షంలో చర్చ 
ఇదిలా ఉండగా.. నాగర్‌కర్నూల్‌లో నడ్డా బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలు ఏపీ జితేందర్‌ రెడ్డి, విజయశాంతి, వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, బూర నర్సయ్య గౌడ్‌ తదితరులు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పార్టీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల, రాజ్‌గోపాల్‌రెడ్డిల ఢిల్లీ పర్యటన చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. పలువురు సీనియర్లు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు నేతలతో సంజయ్‌ విడివిడిగా సమావేశమైనట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

పార్టీని వీడాలనుకుంటే ఆపొద్దు..! 
పార్టీలో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలు చర్చకు వచ్చినపుడు ఎమ్మెల్సీ కవిత లిక్కర్‌ స్కాం విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే  పార్టీకి నష్టం  జరుగుతుందని సంజయ్‌కు కొందరు స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు కాకుండా.. లీకులిస్తున్న నాయకులకే అగ్రనేతలు అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారంటూ ఓనేత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీని వీడాలనుకునే నాయకులను ఆపవద్దని సంజయ్‌కు సీనియర్లు చెప్పినట్లు సమాచారం. కాగా అధికార బీఆర్‌ఎస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, బీఆర్‌ఎస్‌కు బీజేపీయే నిజమైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. 

ఇది కూడా చదవండి: శేజల్‌తో బీఆర్‌ఎస్‌ నేతల చర్చలు.. ఎమ్మెల్యే చిన్నయ్యకు షాక్‌!

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)