Breaking News

యూపీ బీజేపీలో సమూల మార్పులు..?

Published on Wed, 07/17/2024 - 09:31

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పార్టీని సమూల ప్రక్షాళన చేసేందుకు బీజేపీ హై కమాండ్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగానే లక్నో విచ్చేసిన పార్టీ జాతీయ ప్రెసిడెంట్‌ నడ్డా డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేందర్‌ చౌదరితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవితో సహా పలు స్థానాల్లో మార్పులు చేసే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.

ఓబీసీల్లో పట్టుండంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న డిప్యూటీ సీఎం మౌర్యకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మౌర్యకు, సీఎం ఆదిత్యనాథ్‌కు పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల  జరిగిన రెండు కేబినెట్‌ మీటింగ్‌లకు మౌర్య హాజరవకపోవడం చర్చనీయాంశమైంది.

ఈ కారణంతోనే మౌర్య ప్రభుత్వం నుంచి తప్పుకుని పార్టీ చీఫ్‌గా వెళ్లే అవకాశముంది. పార్టీ గ్రూపులుగా చీలిపోయిందని కొందరు నేతలు నడ్డాకు ఫిర్యాదు చేశారు.  ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో  బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో దిద్దుబాటు చర్యలకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది.  యూపీలో సీట్లు కోల్పోవడంతో కేంద్రంలో బీజేపీ ఒంటరిగా మ్యాజిక్‌ఫిగర్‌ను దాటలేక ఎన్డీఏ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)