Breaking News

బీజేపీలో పెను మార్పులు!.. కేంద్రమంత్రిగా బండి, ఈటలకు.. 

Published on Thu, 06/29/2023 - 11:56

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్నకొద్దీ పొలిటికల్‌ పార్టీలు ప్లాన్స్‌ మార్చుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఇక, తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీలో కీలక పదవుల్లో మార్పులు జరుగుతున్నట్టు అధిష్టానం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. 

అయితే, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మార్పు ఉంటుందని కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఆ వార్తలు నిజమేనని తెలుస్తోంది. బీజేపీ చీఫ్‌ మార్పువైపే పార్టీ హైకమాండ్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ పగ్గాలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా.. తెలంగాణలో పార్టీ చీఫ్‌ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇందులో భాగంగానే హైకమాండ్‌ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. జోడు గుర్రాల వేటలో భాగంగా ఈటలకు సరైన జోడి ఎవరనే దానిపై తీవ్ర చర్చ జరుగుతున్నట్టు పార్టీలో చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. బండి సంజయ్‌, ఈటల మధ్య పొసగకపోవడంతోనే పార్టీ చీఫ్‌ మార్పుపై అధిష్టానం ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. ఇక, త్వరలోనే మోదీ కేబినెట్‌ విస్తరణకు కూడా ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బండి సంజయ్‌ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. 

మరోవైపు.. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓ వ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్‌ చేసిన.. ఇది తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్‌ ఉంచారు. ఆయన కాసేపటికే దానిని డిలీట్‌ చేశారు. పైగా ఆ ట్వీట్‌కు అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సాల్‌ లాంటి అగ్రనేతలను ట్యాగ్‌ చేశారాయన. అయితే  ఆయన ట్విటర్‌ వాల్‌పై ఆ పోస్ట్‌ కనిపించకపోవడంతో.. ఆయన దానిని డిలీట్‌ చేసినట్లు అర్థమవుతోంది. దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)