ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి రండి.. బీజేపీలో కీలక పరిణామం!

Published on Fri, 06/23/2023 - 11:56

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కంటే ముందే తెలంగాణలో పాలిటిక్స్‌ స్పీడ్‌ అందుకున్నాయి. రాజకీయ పార్టీల సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇక, తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 

తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి పార్టీ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా, పార్టీలో బాధ్యతల అప్పగింతపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ఈరోజు సాయంత్రం ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వీరిద్దరూ రేపు(శనివారం) అమిత్‌ షా, జేపీ నడ్డాలతో సమావేశం కానున్నారు. 

ఇదిలా ఉండగా.. ‘మహా జన్‌సంపర్క్‌ అభియాన్‌’లో భాగంగా తెలంగాణలో జరిగిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో ఈటల రాజేందర్‌, కోమటిరెడ్ది రాజగోపాల్‌ రెడ్డి పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో బీజేపీలో వీరిద్దరూ ఎందుకు సైలెంట్‌ అయ్యారనే చర్చ కొనసాగింది. ఈ క్రమంలో మరుసటి రోజే వీరిద్దకి హస్తిన నుంచి పిలుపు రావడం పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు టైమొచ్చిందా?..ఆ విషయంలో సక్సెస్‌ అయ్యే ఛాన్స్‌!

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)