Breaking News

బీజేపీకి పిచ్చిపట్టింది.. ఉత్తరాఖండ్ మంత్రి వ్యాఖ్యలపై రావత్ ఫైర్..

Published on Wed, 02/01/2023 - 18:43

డెహ్రాడూన్‌: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలవి హత్యలు కాదు, ప్రమాదాలు అని ఉత్తరాఖండ్ బీజేపీ మంత్రి గణేష్ జోషి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం హరీశ్ రావత్ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి పిచ్చి పట్టిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అమరులను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. వారి త్యాగాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  రావత్ ఈమేరకు ఏఎన్‌ఐ వార్తా సంస్థతో బుధవారం మాట్లాడారు.

మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ ప్రధానులు ఇంధిరా గాంధీ, రాజీవ్ గాంధీలవి హత్యలు కాదు ప్రమాదాలు అని గణేష్ జోషి అన్నారు. బలిదానం అనేది గాంధీ కుటంబాల గుత్తాదిపత్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

శ్రీనగర్‌లో నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముంగిపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన నానమ్మ, నాన్న చనిపోయిన వార్తలను ఫోన్‌ ద్వారానే తెలుసుకున్నానని, ఆ ఘటనలు తలుచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుందని అన్నారు. హింసను ప్రేరేపించే ప్రధాని మోదీ, అమిత్‌ షాలకు ఆ భాద ఎప్పటికీ అర్థంకాదని రాహుల్‌ అన్నారు. ఈ నేపథ్యంలోనే గణేష్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చదవండి: ఐదుగురు భర్తలకు ఒకే భార్య.. టీఎంసీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)