Breaking News

కర్నాటకలో ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ నేతలకు షాకిచ్చిన బీజేపీ

Published on Tue, 05/09/2023 - 17:00

బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. రేపు(బుధవారం) అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుంది. ఇక, ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జాతీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ప్రచారంలో అధికార బీజేపీపై కాంగ్రెస్‌ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ స్థానిక, జాతీయ పత్రికల్లో ‘అవినీతి రేటు కార్డు’ అంటూ ప్రకటనలు ఇచ్చింది. దీంతో, ఈ విషయాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. దీనికి సంబంధించిన ఆధారాలను చూపించాలని డిమాండ్‌ చేసింది. 

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సిద్ద రామయ్య, డీకే శివ కుమార్‌కు బీజేపీ.. క్రిమినల్‌ పరువు నష్టం దావా కేసు వేసింది. అయితే, మే 5వ తేదీన పలు దినపత్రికల్లో బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు(40 శాతం కమీషన్‌ సర్కార్‌) చేస్తూ కాంగ్రెస్‌ ప్రకటనలు ఇచ్చింది. అలాగే, బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ప్రజల నుండి రూ. 1,50,000 కోట్లకు పైగా దోచుకుంది అని తెలిపారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ.. ముగ్గురు కాంగ్రెస్‌ నేతలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ, ప్రకటనలను ఉపసంహరించుకోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా కాంగ్రెస్ నాయకులపై క్రిమినల్ పరువు నష్టం వేసింది. 

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనలపై బీజేపీ నేత ఓం పాఠక్‌.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ ప్రకటనలు తమ పార్టీకి నష్టం​ కలిగించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఓటర్లను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఫైరయ్యారు. ఈ ప్రకటనలకు సంబంధించి ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఇది కూడా చదవండి: మీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)