Breaking News

బ్రిజ్‌భూషణ్‌కు హ్యాండ్‌ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్‌ ఎంపీకి నో ఛాన్స్‌

Published on Thu, 05/02/2024 - 18:23

పార్టీ సీనియర్‌ ఎంపీ, మాజీ రెజ్లింగ్‌ అధ్యక్షుడు బ్రిజ్‌భూషన్‌ శరణ్‌ సింగ్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని కైర్‌గంజ్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ఆయనకు ఈసారి బీజేపీ మొండిచేయి చూపింది. గతంలో భూషన్‌పై జాతీయ స్థాయి రెజర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన్ను పోటీ నుంచి తప్పించింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కైర్‌గంజ్‌ నుంచి ఆయన కొడుకు కరణ్‌ భూషన్‌ సింగ్‌కు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది.

లోక్‌సభ అయిదో విడతలో భాగంగా మే20వ తేదీన కైసర్‌గంజ్‌లో పోలింగ్‌ జరగనుంది. నామినేషన్‌ దాఖలు చేయడానికి తుదిగడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ  నేడు అభ్యర్థని ప్రకటించింది. 

కాగా బ్రిజ్‌భూషన్‌ సింగ్‌ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. చివరి మూడు సార్లు పర్యాయాల్లో (2009, 2014, 2019) కైసర్‌గంజ్‌‌ ఎంపీగా గెలిచి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. అయితే బ్రిజ్‌భూషన్‌ గత రెండేళ్లుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై జాతీయ రెజర్లు చేసిన తీవ్ర ఆరోపణలు అప్పట్లో రాజకీయపరంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో గతేడాది రెజ్లింగ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. 

ఈ క్రమంలోనే విజయవకాశాలను దెబ్బతీస్తాయనే ఆలోచనతో అభ్యర్థిని మార్చేందుకు మొగ్గు చూపింది. అయితే బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు స్థానికంగా ఉన్న రాజకీయ పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని ఆయన కుమారుడిని బరిలో దింపింది.

కరణ్‌ పేరుతోపాటు కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ అభ్యర్థిని సైతం బీజేపీ ప్రకటించింది. రాయ్‌బరేలీలో ప్రతాప్‌ సింగ్‌ను బరిలో నిలిపింది. ఇప్పటికీ కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని వెల్లడించలేదు. గతంలో ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు వెళ్లారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)