Breaking News

పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు.. బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య

Published on Sun, 06/18/2023 - 10:41

పశ్చిమ బెంగాల్‌: పశ్చిమ బెంగాల్‌ లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యున్ని దుండగులు హత్య చేశారు. ఇది అధికార టీఎంసీ పనేనని బాధితులు ఆరోపిస్తున్నారు. 

కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హంతా ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి  బామ్మర్థి శంభు దాస్‌ ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శంభు దాస్ కోడలు విసాఖా దాస్ కిస్మాత్ దాస్‌గ్రామ్ గ్రామంలో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. శంభుదాస్‌ను రాత్రి సమయంలో దుండగులు ఇంటి నుంచి బయటకు పిలిచి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  

మాల్డా జిల్లాలో టీఎంసీ కార్యకర్తను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనకు కారకులు కాంగ్రెస్ కార్యకర్తలేనని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతున్ని ముస్తఫా షేక్గా గుర్తించారు. ఈ ఘటన మరవక ముందే దిన్హంతా ప్రాంతంలో తాజాగా బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య జరగడం గమనార్హం.   

కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హంతాలో బీజేపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు టీఎంసీ మద్దతుదారులు చించేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నితీష్ ప్రమాణిక్ ఆ ‍ప్రాంతాన్ని సందర్శించారు. టీఎంసీ గుండాలు బీజేపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారని ప్రమాణిక్ ఆరోపించారు. నామినేషన్‌కు వచ్చిన అభ్యర్థులపైన రాళ్లు రువ్వారని, బాంబులు వేశారని చెప్పారు.   

నామినేషన్ వేళ అల్లర్లు..

జులై 8న బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల నామినేషన్‌కు గురువారం చివరి తేదీ నాడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. నామినేషన్ ప్రారంభమైన వారం రోజుల్లోనే అల్లర్లలో ఆరుగురు మృతి చెందారు. ఆందోళనకారులు బాంబులు విసురుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇదీ చదవండి:బోస్‌ ఉంటే దేశ విభజన జరిగేది కాదు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)