Breaking News

చిక్కుల్లో బీజేపీ అభ్యర్థి పరమ్‌పాల్‌.. వీఆర్‌ఎస్‌ రద్దు.. డ్యూటీకి రావాలంటూ ఆదేశం!

Published on Wed, 05/08/2024 - 10:43

పంజాబ్‌లోని బఠిండా లోక్‌ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఐఏఎస్ అధికారి పరమ్‌పాల్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. అకాలీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సికందర్ సింగ్ మలుకా కోడలు, పంజాబ్ ఐఏఎస్ అధికారి పరంపాల్ కౌర్ రాజీనామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.

రెండు రోజుల క్రితం పరమ్‌పాల్ కౌర్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే దీనికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ కూడా రాసింది. అయితే పంజాబ్ ప్రభుత్వం పరమ్‌పాల్ కౌర్ వీఆర్‌ఎస్‌ను తిరస్కరించింది. ఆమెను వెంటనే విధుల్లో చేరాలని కోరింది.

ఇటువంటి పరిస్థితిలో పరమ్‌పాల్ కౌర్ నామినేషన్ దాఖలు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. పరంపాల్ కౌర్ స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత తన భర్తతో కలిసి బీజేపీలో చేరారు. ఈ నేపధ్యంలో పార్టీ ఆమెను బఠిండా అభ్యర్థిగా ప్రకటించింది. పంజాబ్ ప్రభుత్వ పర్సనల్ డిపార్ట్‌మెంట్ తన నోటీసులో.. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్‌లోని రూల్ 16(2) ప్రకారం సమర్థ ప్రీ-డిశ్చార్జ్ కోసం పరమ్‌పాల్‌ కౌర్ దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. వృద్ధురాలైన తల్లిని చూసుకోవడానికి  రిటైర్మెంట్ కోరుతున్నట్లు ఆమె తన దరఖాస్తులో పేర్కొన్నారు.

పదవీ విరమణ దరఖాస్తు నిబంధనల ప్రకారం మూడు నెలల నోటీసు వ్యవధిని మినహాయించాలని పరమ్‌పాల్ కౌర్ అభ్యర్థించారు. అయితే పంజాబ్ ప్రభుత్వ  సిబ్బంది విభాగం పంపిన నోటీసులో పదవీ విరమణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సంబంధిత అధికారికి మూడు నెలల నోటీసు వ్యవధి నుండి మినహాయింపు ఇవ్వగలదని స్పష్టం చేసింది . కేంద్ర ప్రభుత్వానికి ఈ హక్కు లేదని దానిలో పేర్కొంది.

అలాగే తల్లి సంరక్షణకు కోసం పదవీ విరమణ కోరుతున్నట్లు దరఖాస్తులో పేర్కొన్న కారణం నిరాధారమైనదిగా పరిగణిస్తున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. ఆమె దరఖాస్తు సమర్పించాక రాజకీయాలలో చురుకుగా మారారు. అందుకే ఈ కారణం నిరాధారమని సదరు నోటీసులో పేర్కొన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఆమె రిలీఫ్ అప్లికేషన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆమె తక్షణమే విధుల్లో చేరాలని ఆ నోటీసులో ఆమెకు తెలియజేశారు. 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)