Breaking News

Ambedkar Row: కౌన్సిలర్ల డిష్యూం.. డిష్యూం

Published on Tue, 12/24/2024 - 16:11

చండీగఢ్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారలేదు. ఈలోపు.. మంగళవారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. షా వ్యాఖ్యల నేపథ్యంతో.. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

గత వారం రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలతో అమిత్‌ షా రాజీనామా చేయాలంటూ చండీఘడ్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు తమ ఆమోదాన్ని తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కౌన్సిలర్లు జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో బీఆర్‌ అంబేద్కర్‌కు అవమానం జరిగిందని ఆరోపించారు. 

దీంతో కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దాదాపు 20 నిమిషాల పాటు కౌన్సిలర్లు భౌతికంగా కలబడ్డారు. 

అయితే జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో రిటర్నింగ్‌ అధికారి, నామినేటడ్‌ కౌన్సిలర్‌  అనిల్ మసీహ్‌ వివాదాస్పదంగా వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వంగా వ్యవహరించారని స్పష్టంగా తేలింది. దీనిపై సుప్రీం కోర్టు అనిల్‌ మసీహ్‌పై అంక్షితలు వేసింది.

ఇవాళ జరిగిన మున్సిపల్‌ సమావేశంలో బీజేపీ నుంచి నామినేటెడ్‌ కౌన్సిలర్‌గా ఉన్న అనిల్‌ మసీహ్‌ను కాంగ్రెస్‌ కౌన్సిలర్లు నాటి ఘటనను ప్రస్తావిస్తూ ఎన్నికల దొంగ అంటూ సంభోదించారు. బదులుగా అనిల్‌ మసీహ్‌ సైతం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో బెయిల్‌పై బయట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు ఘర్షణకు దారి తీసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)