Breaking News

తెలంగాణకు పటేల్ వరం.. నెహ్రూ శాపం: మహేశ్వర్‌ రెడ్డి

Published on Sat, 01/03/2026 - 20:16

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి. బీఆర్‌ఎస్‌ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. సభను భజన మండలిగా మార్చారు అంటూ మండిపడ్డారు.

కృష్ణ జలాలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. అనంతరం, బీజేఎల్పీ మహేశ్వర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు పటేల్ వరం అయితే.. నెహ్రూ శాపం. పటేల్ రజాకర్ల నుంచి విముక్తి చేస్తే.. నెహ్రూ తెలంగాణను ఆంధ్రాలో కలిపి ద్రోహం చేశారు. జల దోపిడికి నెహ్రూ చేసిన పనితోనే శ్రీకారం పడింది. బీఆర్‌ఎస్‌ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని దురాశతో ఏపీకి సాగు నీళ్ళను దారాదత్తం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన గుత్తదారుల జేబులు నింపడానికి అదే పని చేస్తుంది. నాగార్జున సాగర్ తెలంగాణకు వచ్చే ఎడమ కాల్వను పైకి కట్టి, కుడి కాల్వను కిందకు కట్టి దోపిడిని ఆరోజే ప్రారంభించారు. తెలంగాణ కోసం చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ అంతా గందరగోళం.. ఇంకా పూర్తి కాలేదు.

సభలో కాంగ్రెస్‌ తరఫున 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. బీజేపీ నుండి ఒక్కరికీ మాత్రమే ఇచ్చారు. బీజేపీ నుండి మరొకరికి అవకాశం అడిగితే ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఎలాగో సభలో లేనే లేదు.. ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వచ్చు కదా?. ఎంఐఎం, సీపీఐతో డబ్బా కొట్టించుకున్నారు. సభను భజన మండలిగా మార్చారు’ అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)