Breaking News

మహదేవ్ ప్రమోటర్ల నుంచి ఛత్తీస్‌గఢ్ సీఎంకి రూ.508 కోట్లు.. ఈడీ సంచలన ఆరోపణలు

Published on Fri, 11/03/2023 - 20:28

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో నాయకులు ప్రచారంలో దూసుకున్నారు. దీంతో చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వాడీవేడిగా మారింది 

తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి సీఎం భూపేష్ బఘేల్‌ రూ.  508 కోట్లు స్వీకరించినట్లు ఈడీ పేర్కొంది.  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహదేవ్‌ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్‌లో భారీ మొత్తంలో నగదు చెలామణి అవుతున్నట్లు తమకు గురువారం సమాచారం అందిందని ఈడీ అధికారులు తెలిపారు

ఈ మేరకు హోటల్‌ ట్రిటన్‌లతోపాటు భిలాయ్‌లోని మరోచోట ఈడీ సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల ఖర్చు కోసం యూఏఈ నుంచి నగదు తీసుకొస్తున్న అసిమ్‌ దామ్‌ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు ఈడీ తెలిపింది. ఆయన కారు, నివాసంపై సోదాలు జరపగా.. రూ.5.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.

అయితే ఆ డబ్బును రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెట్టేందుకు మహదేవ్‌ యాప్‌ ప్రమోటర్లు బఘేల్‌కు డెలివరి చేసేందుకు ఉద్ధేశించినట్లు నగదుతో పట్టుబడిన వ్యక్తి తమకు తెలిపినట్లు ఈడీ వెల్లడించింది. అంతేగాక మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్‌కు రూ. 508 కోట్లు చెల్లింపులు చేసినట్లు చెప్పారని పేర్కొంది. కాగా చత్తీస్‌గఢ్‌లో తొలి దశ ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఈ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారాయి. నవంబర్‌ 7, 17 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.‍

ఇదిలా ఉండగా మహదేవ్ బెట్టింగ్ యాప్‌ నిర్వహకులు విదేశాల్లో ఉంటూ, ఛత్తీస్‌గఢ్‌లోని తన సన్నిహితులతో బెట్టింగ్ సిండికేట్ నడుపుతున్నారు. ఈ  బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసింది. ఇప్పటివరకు రూ. 450 కోట్లకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకుంది. మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసులో ఈడీ ఇటీవలే తొలి ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఇందులో యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ సహా 14 మంది నిందితులుగా ఉన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)