Breaking News

నామినేషన్‌ వెనక్కి.. ప్రముఖ నటుడికి ఊరట

Published on Sat, 05/18/2024 - 07:44

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. బీహార్‌లోని కరకట్‌ లోక్‌సభ స్థానంలో విచిత్ర రాజకీయ వాతావరణం కనిపించింది.

ఈ సీటు నుంచి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఇంతలోనే అతని తల్లి తల్లి ప్రతిమా దేవి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, అనంతరం ఉపసంహరించుకున్నారు. మరోవైపు పవన్ సింగ్ ఎన్నికల ప్రచారంతో ప్రజల మధ్యకు వెళుతున్నారు.

పవన్ సింగ్ తల్లి నామినేషన్‌ ఉపసంహరణ వెనుక ఒక వాదన వినిపిస్తోంది. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా బీజేపీ కూటమి తరపున  కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పవన్ సింగ్‌కు కూడా బీజేపీతో అనుబంధం ఉంది. దీంతో అతనిపై నామినేషన్‌ ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి వచ్చిందని సమాచారం. దానిని పట్టించుకోకుండా పవన్‌ సింగ్‌ కరకట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసి,  ఎన్నికల బరిలోకి దిగారు. కుమారునికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే అతని తల్లి నామినేషన్‌ దాఖలు చేశారనే మాట వినిపిస్తోంది. అయితే ఆ తరువాత ఆమె తన నామినేషన్‌ వెనక్కి తీసుకున్నారు.

దీనికి ముందు పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను బీజేపీ పవన్ సింగ్‌కు కేటాయించింది. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు నిరాకరించారు. అనంతరం తాను కరకట్‌ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పవన్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటించారు. ప్రతిమాదేవి నామినేషన్ ఉపసంహరణను ఎన్నికల సంఘం ధృవీకరించింది. ఆమె మే 14న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్‌ సింగ్‌ తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే అనుమానంతోనే తన తల్లి ప్రతిమా దేవి చేత నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిన కరకట్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)