Breaking News

గుత్తా, జగదీష్‌ రెడ్డి కుటుంబ ఆస్తులపై భట్టి సంచలన ఆరోపణలు!

Published on Wed, 06/14/2023 - 16:13

సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి గురించి మాట్లాడమంటే వారిద్దరూ నా పంచ గురించి మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి జగదీష్‌ రెడ్డికి భటి కౌంటర్‌ ఇచ్చారు. వీరి ఆస్తులు వేల కోట్లకు ఎలా చేరుకున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు.

కాగా, కనగల్లులో భట్టి విక్రమార్క కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో భవిష్యత్తే లేకుండా పోయింది. ధరణి పేరుతో భూమి గుంజుకుంటున్నారు. గిరిజన పోడు భూములను లాక్కుంటున్నారు. ఉద్యోగాలు వస్తామని ఎదురు చూస్తుంటే ఉద్యోగాలు రావడం లేదు. ఎక్కడా ఇల్లు లేదు.. వాకిలి లేదు. ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వడం లేదు.

ఉపాధి పనులు చేసుకునేవాళ్లకు కూలీ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో నేడు భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లాలోని దాదాపు మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించారు. సొరంగం తవ్వేందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకువచ్చాం. టన్నెల్‌కు సంబంధించిన దాదాపు 32 కిలోమీటర్ల పనులను పూర్తి చేశాం.

రాష్ట్రం వచ్చి పదేళ్లువుతోంది.. ఇన్నేళ్లలో పట్టుమని రెండు మూడు కిలోమటర్లు కూడా తవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడమంటే నా పంచ గురించి, నా గోశి గురించి జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎక్కడా మార్పు రాలేదు. బీఆర్ఎస్ నాయకుల జీవితాల్లో మాత్రం అద్భుతమైన మార్పు వచ్చింది. సీఎం కేసీఆర్, జగదీష్‌ రెడ్డి కుటుంబం, గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ ఆస్తులు వేల కోట్లు పెరిగాయి. వీరిద్దరి లాంటి వాళ్లతో నల్లగొండ జిల్లా ప్రజలకు ఏలాంటి ప్రయోజనం ఉండదు అంటూ కౌంటర్‌ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. కార్యకర్తల నారాజ్‌!

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)