Breaking News

Bhajanlal: ఓడిపోతారనుకున్నారు.. కానీ సీఎంగా ఎంపిక!

Published on Tue, 12/12/2023 - 17:51

జైపూర్‌: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే కాదు.. ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపికలోనూ బీజేపీ కొత్త స్ట్రాటజీని ప్రదర్శించింది. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుడ్ని, మధ్యప్రదేశ్‌లో బీసీ(యాదవ్‌)ని, అలాగే.. తాజాగా రాజస్థాన్‌లో ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ప్రకటించి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తద్వారా సీనియర్లకు షాక్‌ ఇవ్వడంతో పాటు కొత్త తరహా రాజకీయానికి తెర లేపింది బీజేపీ. అయితే.. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. భజన్‌లాల్‌ మొదటిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. పైగా ఆయన గెలుస్తారని బీజేపీ శ్రేణులు కూడా అనుకోలేదట!. 

భజన్‌లాల్‌ శర్మ.. మొదటిసారి రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. చివరి నిమిషంలో సీఎం అభ్యర్థుల జాబితాలో ఆయన పేరును చేర్చి.. అదే పేరును ప్రకటించింది బీజేపీ. అయితే ఆయన గెలవరని పార్టీ భావించిందట. అందుకు కారణం లేకపోలేదు. 

► భజన్‌లాల్‌ స్వస్థలం భరత్‌పూర్‌. కానీ, ఆయనకు ఆ టికెట్‌ను బీజేపీ ఇవ్వలేదు. అక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఆయన ఓడిపోతారని బీజేపీ భావించింది. అందుకే సంగనేర్‌ టికెట్‌ ఇచ్చింది.  అక్కడా ఆయన నెగ్గుతారని ఊహించలేదట. అయితే.. సంగనేర్‌ టికెట్‌ మీద పోటీ చేసి భజన్‌లాల్‌ 48వేలపైగా మెజారిటీతో నెగ్గారు. 

► భజన్‌లాల్‌ మొదటి నుంచి బీజేపీ పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొనేవారు. అత్యంత ఎక్కువ కాలం బీజేపీ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీగా పనిచేశారు.

► రాజకీయాల్లోకి రాకముందు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీలో విద్యార్థి నాయకుడి పనిచేశారు. 

► ఓసీ సామాజికవర్గానికి చెందిన భజన్‌ లాల్‌ రాజస్థాన్‌ వ్యాప్తంగా నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పార్టీలో ఉన్న అన్ని వర్గాల కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగేవారు.

►  56 ఏళ్ల భజన్‌లాల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 1.5కోట్ల ఆస్తులను చూపించారు.     

ఇదీ చదవండి:  రాజస్థాన్‌ సీఎంగా ఫస్ట్‌ టైం ఎమ్మెల్యే

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)