Breaking News

ఇంట్లో కూర్చుని రెడీ చేశారా?.. ఎగ్జిట్‌పోల్స్‌పై మమతా బెనర్జీ సెటైర్లు

Published on Mon, 06/03/2024 - 09:09

కోల్‌కత్తా: దేశంలో ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. దేశవ్యాప్తంగా రేపు(మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక, ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్‌ రిలీజ్‌ అయ్యాయి. కాగా, ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ ఎగ్జిట్‌పోల్స్‌ను రెండు నెలల క్రితమే ‘ఇంట్లో తయారు చేశారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

కాగా, ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపై మమతా బెనర్జీ ఆదివారం స్పందించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేవు. వీటిని రెండు నెలల క్రితమే ఇంట్లో కూర్చుని తయారు చేసినట్టు అనిపిస్తోంది. బెంగాల్‌లో 2016, 2019, 2021లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా చేశారో అందరూ చూశారు. వారి అంచనాలేవీ నిజం కాలేదు. ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రజా స్పందన ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను ధ్రువీకరించడం లేదు అంటూ కామెంట్స్‌ చేశారు.

అలాగే, ఇండియా కూటమికి సంబంధించి కూడా మమత కీలక వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, స్టాలిన్‌తో పాటు అన్నిచోట్లా ప్రాంతీయ పార్టీలు మెరుగైన పనితీరు కనబరుస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 

 

ఇదిలా ఉండగా.. ఎన్నికలకు సంబంధించి దాదాపు ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. మోదీనే మరోసారి ప్రధాని అవుతారని ఫలితాలను వెల్లడించాయి. ఇండియా కూటమికి భారీ ఓటమి తప్పదని తేల్చేశాయి. అయితే, అటు కూటమి నేతలు కూడా ఎగ్జిట్‌పోల్స్‌ ఫేక్‌ అంటూ కొట్టిపారేస్తున్నారు. 

 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు