Breaking News

మా సందేహాలు ఈసీ నివృత్తి చేయలేదు: వైఎస్సార్‌సీపీ నేతలు

Published on Tue, 08/27/2024 - 15:45

సాక్షి, విజయనగరం: మా సందేహాలను ఎలక్షన్‌ కమిషన్‌ నివృత్తి చేయలేదని వైఎస్సార్‌సీపీ నేతలు బెల్లాన చంద్రశేఖర్‌, బొత్స అప్పల నర్సయ్య అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాక్ పోలింగ్ రీ-వెరిఫికేషన్ అనేది మా ఫిర్యాదు అంశం కాదు. పోలింగ్ నాటి బాటరీని వెరిఫికేషన్ చేయమని కోరాం. దాన్ని వెరిఫికేషన్ చేయడానికి ఈసీ ఆదేశాలు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ చెప్పారు’’ అని వారు పేర్కొన్నారు.

ఫిర్యాదు చేసిన ఈవీఎంలో డేటాను తొలగించి డమ్మీ గుర్తులు లోడ్ చేశారు. విచారణలో వుండగా ఈవీఎం డేటాను డిలీట్ చేయడం నేరం. కోర్టుకు ఆధారాలు లేకుండా చేశారు. ఈసీ తీరుపై మేం కోర్టుకు న్యాయం కోసం వెళ్తాం. దేశమంతా ఈవీఎంలు టెంపర్ జరిగాయని అనుమానిస్తుంది. ఈ అనుమానాలను బీజేపీ ప్రభుత్వం నివృత్తి చేయాలి’’ అని  బెల్లాన చంద్రశేఖర్‌, బొత్స అప్పల నర్సయ్య డిమాండ్‌ చేశారు.

కాగా, విజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది.. ఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్‌ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్‌.. ఈసీ ఆదేశాల మేరకు మాక్‌  పోలింగ్‌  చేస్తామనన్నారు. తమ దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదని.. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య ప్రశ్నించారు. ఈసీ, జిల్లా అధికారుల తీరుపై అనుమానాలు మరింత బలపడాయి. ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను  జిల్లా యంత్రాంగం తప్పు దారి పట్టిస్తోంది. కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుంచి కలెక్టర్‌ వెళ్లిపోయారు.

 

 

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు