Breaking News

తెలంగాణలో బీసీ సంక్షేమశాఖ ఎత్తేసే కుట్ర!

Published on Tue, 06/06/2023 - 16:01

సాక్షి, హైదరాబాద్‌: ఓవైపు ఏపీ సర్కార్‌ బీసీలకు మేలు చేస్తుంటే.. తెలంగాణ సర్కార్‌ తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య. అంతేకాదు బీసీలకు సాయం అందిస్తామని ప్రకటించిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మాట తప్పిందని, తెలంగాణలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎత్తేసే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారాయన. 

‘‘బీసీల్లో ఆరు కులాలకు మాత్రమే టీఎస్‌ సర్కార్‌ రూ. లక్ష సాయం అందిస్తోంది. గతంలో అనేక కులాలకు ఇస్తామని హామీ ఇచ్చింది. బీసీల్లో ఉన్న మిగతా 130 కులాలకు కూడా రూ. లక్ష సాయం అందించాలి’’ అని డిమాండ్‌ చేశారాయన. ఇక.. బీసీ బంధు ఇస్తామని రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్‌ఉన్న రాష్ట్రం కాబట్టి అందరికీ నిధులు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారాయన. 

ఉన్నత చదువులు చదివే విద్యార్థులను ప్రభుత్వమే ఆదుకోవాలని గుర్తు చేస్తున్నారాయన. అలాగే ‘‘తెలంగాణలో కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్లకు రూ.10 వేలు ఇస్తున్నారు. కానీ, ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖ ఎత్తివేసే కుట్రజరుగుతోందని, సీఎం పేషీలో కూడా అదే విధంగా జరుగుతోందని’’ రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య సంచలన ఆరోపణలు చేశారు. 
 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)