Breaking News

ఎన్నికలకు చేరిన సోరెస్‌ ఇంటి పోరు!

Published on Thu, 03/28/2024 - 09:31

జార్ఖండ్ రాజకీయాలను శాసించిన శిబూ సోరెన్ కుటుంబం ఇప్పుడు ఇంటి పోరును ఎదుర్కొంటోంది. శిబూ సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ సొంత పార్టీ జేఎంఎంను వీడి బీజేపీలో చేరారు. దుమ్కా స్థానం నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగుతున్నారు. 

1980 తర్వాత ఒకటి రెండు ఎన్నికలు మినహా దుమ్కా సీటు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆధీనంలో ఉంది. జేఎంఎం అధినేత శిబు సోరెన్  ఇక్కడి నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా  ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్.. శిబు సోరెన్‌పై విజయం సాధించారు. ఈసారి కూడా బీజేపీ సునీల్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, సీతా సోరెన్ పార్టీలో చేరిన తర్వాత అభ్యర్థిని మార్చింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేసిన దరిమిలా జేఎంఎం ఇక్కడి నుంచి హేమంత్ భార్య కల్పనా సోరెన్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గండే అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆమెను అభ్యర్థిగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

దుమ్కాలో జేఎంఎం అభ్యర్థి హేమంత్ లేదా కల్పన ఎవరైనా సరే, వారి కుటుంబానికి చెందిన సీతా సోరెన్‌తో పోటీ పడవలసి ఉంటుంది. సీతా సోరెన్‌ బీజేపీ అభ్యర్థిగానే కాకుండా బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోరెన్‌ కుటుంబ పోరు ఆసక్తికరంగా మారింది. 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు