Breaking News

బంగ్లాదేశ్‌ సంక్షోభం.. ప్రతి నియంతకు ఒక గుణపాఠం: ఫరూక్‌ అబ్దుల్లా

Published on Tue, 08/06/2024 - 18:50

బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు, రాజకీయ అస్థిరతపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా స్పందించారు. ప్రస్తుత బంగ్లాదేశ్‌ పరిణామాలు.. ఆ దేశానికే కాకుండా, ప్రతి నియంతకు ఒక హెచ్చరిక సందేశంగా పేర్కొన్నారు. ఈ మేరకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత మాట్లాడుతూ.. షేక్‌ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, దేశం విడిచి పారిపోవడం.. ప్రతి నియంతకు ఓ గుణపాఠమని పేర్కొన్నారు. 

ప్రజల ఓపిక నశించినప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అన్నారు. నియంతృత్వం ఎప్పటికైనా ప్రజల అసంతృప్తతి, ఆగ్రహానికి కారణమవుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా షేక్ హసీనా నిలబడలేదని, అందుకే ఆమె ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చిందనిన్నారు.

‘బంగ్లాదేశ్‌లో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దేశంలో అంతర్గత పరిస్థితి కూడా బాగా లేదు. అందుకే అక్కడ రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా విద్యార్థులు లేవనెత్తిన  ఉద్యమాన్ని  అణచివేయడం అక్కడి సైన్యానికి గానీ, ఇంకెవరికీ గానీ సాధ్యం కాలేదు. కాబట్టి ఇది ఒక గుణ పాఠం. బంగ్లాదేశ్‌కు మాత్రమే కాదు. ప్రజల ఆగ్రహానికి గురైన ప్రతి నియంత దీనిని నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రజల ఓపిక నశించే సమయం వస్తే ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాపై నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆదివారం జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా మరణించగా.. మొత్తంగా 300 మంది మృతి చెందారు. నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే.

హసీనా రాజీనామాతో నిరసనకారులు చెలరేగిపోయారు. ప్రధాని ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. పలు వస్తువులను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. హసీనా తండ్రి, మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. బంగ్లాదేశ్ పార్లమెంటులోనూ విధ్వంసానికి పాల్పడ్డారు.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)