Breaking News

ఒక్కరోజే వంద దరఖాస్తులు

Published on Sat, 02/03/2024 - 05:16

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మేరకు పార్టీకి శుక్రవారం ఒక్కరోజే వంద దరఖాస్తులు అందాయి.  శుక్రవారం గాం«దీభవన్‌కు వచ్చిన పలువురు నేతలు తమ దరఖాస్తులను అందజేశారు. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ దర ఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో తక్కువగా వచ్చా యి.

దరఖాస్తు చేసుకున్న వారిలో సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ (మల్కాజిగిరి), మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్‌కర్నూల్‌), ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్‌) పెరిక శ్యామ్‌ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌తో పాటు జనరల్‌ స్థానమైన మల్కాజిగిరి కోసం 4 దరఖాస్తులు అందజేశారు. కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ల కోసం ఇప్పటివరకు 141 దరఖాస్తులు రాగా, శనివారం సాయంత్రంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.  

ఖమ్మం బరిలో గడల, వంకాయలపాటి 
హాట్‌సీట్‌గా మారిన ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టికెట్‌ కోసం శుక్రవారం ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్‌లు దరఖాస్తు చేసు కున్నారు. గడల సికింద్రాబాద్‌ స్థానానికి కూడా దర ఖాస్తు చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉండి, అప్పటి సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. అప్పట్లో కొత్తగూడెం అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. కానీ కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వలేదు. ఇటీవలే రేవంత్‌ ప్రభుత్వం గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసింది. ప్రస్తుతం లాంగ్‌లీవ్‌లో ఉన్న ఆయన ఉన్నట్టుండి గాం«దీభవన్‌లో దరఖాస్తులివ్వడం గమనార్హం.  

మెజార్టీ స్థానాలు గెలుస్తాం: బండ్ల గణేశ్‌ 
మల్కాజిగిరి స్థానం నుంచి పోటీకి అవకాశం కల్పించాలని కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు దరఖాస్తు ఇచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ..విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంటుందన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)