Breaking News

తెలంగాణకు సీఎం కేసీఆరా? లేక కేటీఆరా?: బండి సంజయ్‌

Published on Sun, 08/06/2023 - 14:42

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు వాస్తవాలు గ్రహిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ లక్ష కోట్ల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

కాగా, బండి సంజయ్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి. రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాట డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది అన్న చందంలా తయారైంది. ఆర్టీసీ కార్మికులు వాస్తవాలు గ్రహిస్తున్నారు. ప్రభుత్వం 15-20 కోట్ల ఆ‍ర్టీసీ డబ్బులు వాడుకున్నారు. ఆర్టీసీ విలీన బిల్లులో వాటి గురించి లేదు. కార్మికుల సీసీఎస్‌ డబ్బులు 4500 కోట్లు, పీఎఫ్‌ డబ్బులు 9వేల కోట్లు వాడుకున్నారు.. అవి ఎవరు ఇస్తారు?. కేసీఆర్‌ లక్ష కోట్ల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

కరీంనగర్, ఆర్మూర్‌లో ఇప్పటికే ఆర్టీసీ ఆస్తులను లీజు పేరుతో కొల్లగొట్టారు. ఆర్టీసీ ఆస్తులను కొట్టేసేందుకు విలీనం పేరుతో డ్రామా ఆడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు బెనిఫిట్ల ప్రస్తావన బిల్లులో లేదు. కేసీఆర్‌ ప్రభుత్వం కుట్రలు బయటకు వస్తాయి. ఆర్టీసీ ఉద్యోగుల ఓట్ల కోసమే విలీనం డ్రామా ఆడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు లాభం చేకూరడానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కృషి చేస్తున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి. కేటీఆర్‌ భాష, అహంకారం చూసి ప్రజలు తిరగబడుతున్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్‌ మహారాష్ట్రలో రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆరా లేక కేటీఆరా?. ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ను ప్రకటిస్తే బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరు అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: గవర్నర్‌ తమిళిసైతో ఆర్టీసీ అధికారుల భేటీ

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)