Breaking News

బీజేపీ అధ్యక్షుడిగా వస్తానో.. లేదో? 

Published on Mon, 07/03/2023 - 05:05

హనుమకొండ: హనుమకొండలో ఈనెల 8న జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో.. అని బండి సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు జన సమీకరణపై ఆదివారం సాయంత్రం హనుమకొండలో సమావేశం జరిగింది. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ ప్రచారం జరుగుతోందని.. వాస్తవమేనా? అని బండి సంజయ్‌ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. బండి వల్లే రాష్ట్రంలో బీజేపీ గ్రామీణ స్థాయి వరకు విస్తరించిందని.. ఆయన పోరాట స్ఫూర్తితోనే గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల అరాచకాలను ఎదుర్కొనగలుగుతున్నాం.. ప్రజల్లో గౌరవం పెరిగింది అని కార్యకర్తలు స్పష్టం చేశారు. మీరే అధ్యక్షుడిగా కొనసాగాలి.. అని   కన్నీటి పర్యంతమయ్యారు. మీ కష్టం వృథా కాదు.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మీకే ఉంటాయి.. అని కార్యకర్తలు బండి సంజయ్‌కుమార్‌కు బాసటగా నిలిచారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్‌ కార్యకర్తలకు చెప్పారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)