Breaking News

ప్రజల కోసం పోరాడుతున్నాం.. మద్దతివ్వండి 

Published on Thu, 11/23/2023 - 04:30

కరీంనగర్‌ టౌన్‌: నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని రెండుసార్లు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడుతున్న బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. బుధవారం కరీంనగర్‌లోని రేకుర్తి, మంకమ్మతోటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగుల్లో ఆయన మాట్లాడారు.

ప్రధాని మోదీ 2,40,000 ఇళ్లు ఇస్తే కేసీఆర్‌ ఒక్కఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా కేసీఆర్‌ మాత్రం 100 గదులతో ప్రగతి భవన్‌ కట్టుకున్నారని దుయ్యబట్టారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. కేసీఆర్‌ ఇంట్లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

నిరుద్యోగులు ప్రశ్నించిన పాపానికి కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్‌ చేశారని, పేపర్‌ లీకేజీలపై తాను కొట్లాడితే... తన ఇంటిపై వందల మంది పోలీసులతో దాడి చేయించి అరెస్ట్‌ చేయించారని మండిపడ్డారు.  
 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)