Breaking News

బండికి కేంద్రమంత్రి పదవి.. టీబీజేపీ చీఫ్‌గా డీకే అరుణ!

Published on Sat, 06/10/2023 - 11:53

సాక్షి, ఢిల్లీ: రాబోయే రోజుల్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  ఈ ఐదు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా వర్గపోరుతో కేడర్‌ను అయోమయంలో నెట్టేసిన తెలంగాణ బీజేపీకి బూస్టింగ్‌ ఇచ్చే పనిలో తలమునకలైంది అధిష్టానం. నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాల నడుమ..  వారం రోజులుగా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి బీజేపీ పార్టీ శ్రేణులు.  

వర్గపోరుకు చెక్‌ పెట్టేలా హస్తినలో ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. క్యాడర్‌లో నెలకొన్న అయోమయాన్ని తొలగించడానికి..  మరీ ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో నాయకత్వంలో ప్రధాన మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

కీలక నేతలు అసంతృప్తికి లోనుకాకుండా చూసుకుంటూనే.. కేడర్‌ను పటిష్టంగా మార్చాలన్నది బీజేపీ అధిష్టానం అభిమతంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలైన డీకే అరుణకి.. బీజేపీ తెలంగాణ బీజేపీ చీఫ్‌ పగ్గాలు అప్పజెప్పాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జాబితాలో ఉన్న పలువురి పేర్ల పరిశీలన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. కరీంనగర్‌ ఎంపీ అయిన బండి సంజయ్‌(ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు)ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని భావిస్తోందట. ఇక ఇప్పటికే ఈటల రాజేందర్‌కు ఎన్నికల ప్రచార సారథిగా బాధ్యతలు అప్పజెప్పగా.. ఆయన ఆల్రెడీ రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పనులు మొదలుపెట్టారు కూడా.  తద్వారా.. పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ భావిస్తోంది.  

గత పక్షం రోజులుగా ఇక్కడి నుంచి నేతలు వరుసగా అక్కడికి వెళ్తుండడం.. వాళ్లతో మంతనాలు కొనసాగిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ క్రమంలోనే నాయకత్వ మార్పుపై సాధారణంగానే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ నెల 15న ఖమ్మం లో అమిత్ షా పర్యటించనున్నారు. ఆ పర్యటనకు ముందే నాయకత్వ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)