Breaking News

ముందు మీ నాన్నను నిలదీయండి

Published on Sat, 03/04/2023 - 05:00

జగిత్యాల: ‘మహిళలపై అత్యాచారం జరిగితే ఎందుకు నోరు విప్పడం లేదు? అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు ఏవీ? మీ ప్రభుత్వంలో మహిళలు ఎందరున్నారు?  మీ పారీ్టలో ఎంతమంది మహిళలకు చోటిచ్చారు? మహిళా గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారు? వీటిపై ముందు మీ నాన్నను నిలదీయండి.. జంతర్‌మంతర్‌ వద్ద నువ్వు ధర్నా చేస్తానంటే మహిళలు నవ్వుకుంటున్నారు..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. శుక్రవారం జగిత్యాలలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ భోగ శ్రావణితో ఆయన భేటీ అయ్యారు. ఆమె నివాసంలో కాసేపు వివిధ అంశాలపై చర్చించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు.  

ఎంఐఎం పరాన్నజీవుల పార్టీ 
మహిళా బిల్లు విషయంలో కవిత ఢిల్లీలో ధర్నా చేస్తామనడం విడ్డూరంగా ఉందని సంజయ్‌ వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును ప్రవేశపెడితే పార్లమెంటులో ఆ కాపీలను చింపిపడేసిన పారీ్టలతో ఎందుకు దోస్తానా చేస్తున్నావని నిలదీశారు. మెడికో ప్రీతి నాయక్‌ ఆత్మహత్య చేసుకున్నా, నిర్మల్‌లో బాలికపై అధికార పార్టీ నేతే అత్యాచారానికి పాల్పడినా ముఖ్యమంత్రి కనీసం స్పందించ లేదని విమర్శించారు.

గంటకో లైంగిక వేధింపు, పూటకో అత్యాచారం జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసేవారి, హత్యలకు పాల్పడేవారి అంతు చూస్తామని  హెచ్చరించారు. బీజేపీ అంతు చూస్తామని మజ్లిస్‌ నేత ఒవైసీ చెప్పడం హాస్యాస్పదమని సంజయ్‌ పేర్కొన్నారు. ఎంఐఎం పరాన్నజీవుల పార్టీ అని, సీఎం విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడే పార్టీ అని ధ్వజమెత్తారు. దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్‌ చేశారు. 
 

#

Tags : 1

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)