Breaking News

నా భార్య తల నరికేస్తామన్నారు

Published on Mon, 10/30/2023 - 03:18

కరీంనగర్‌టౌన్‌: తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమ యంలో హైదరాబాద్‌ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభకు సిద్ధమైతే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ‘ఏయ్‌ బండి సంజయ్‌.. పాతబస్తీలో సభ పెట్టాలనే ఆలోచన విరమించుకోకుంటే నీ భార్య తల నరికి నీకు గిఫ్ట్‌గా ఇస్తాం. నీ ఇద్దరు కొడుకులను కిడ్నాప్‌ చేస్తాం..’అంటూ బెదిరించారు. అయినా వెనుకంజ వేయకుండా పాతబస్తీలో సభ పెట్టిన చరిత్ర మాది’అని సంజయ్‌ పేర్కొ న్నారు.

ఆదివారం కరీంనగర్‌లోని ఈఎన్‌ గార్డెన్స్‌లో జరిగిన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరీంనగర్‌ ఎంపీగా తాను గెలిచానంటే అది కార్యకర్తలతోనేనని అన్నారు. ప్రజలు ఎంపీగా గెలిపించారు కాబట్టే తెలంగాణ అంతా తిరిగి పేదల పక్షాన పోరాడానని, ఫాంహౌస్‌కు పరి మితమైన కేసీఆర్‌ను ధర్నా చౌక్‌కు గుంజుకొచ్చానని పేర్కొ న్నారు.

కాగా, ధర్మం కోసమే పోరాడే మరో నాయకుడు రాజాసింగ్‌ ఏడాదిపాటు బీజేపీకి దూరమైనా.. చంపుతామని కొందరు బెదిరించినా హిందూ ధర్మాన్ని వదిలిపెట్టలేదని సంజయ్‌ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్‌. విఠల్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)