Breaking News

బాబు మోహన్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీకి రాజీనామా?

Published on Sat, 10/28/2023 - 17:58

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేత, నటుడు బాబు మోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. 

బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో తనకు టికెట్‌ ఇవ్వకపోవడంపై బాబు మోహన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఫోన్ చేస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లిఫ్ట్‌ చేయడం లేదని విమర్శించారు. తన విషయంలో పార్టీ ఇచ్చే స్పందనను బట్టి బీజేపీలో ఉండాలా? లేదా అని నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటానని పేర్కొన్నారు.

అదే విధంగా సోషల్ మీడియాలో తన కుమారునికి తనకు మధ్య టికెట్ కోసం పోటీ నెలకొందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని బాబు మోహన్‌ పేర్కొన్నారు.   మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిచారని, ఇది సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆందోల్ ప్రజలు తనను మూడు సార్లు ఆదరించారని పేర్కొన్నారు.  అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ మంచి నాయకుడేనని.. కానీ రాష్ట్రంలో ఉన్న నేతల తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించారు. అర్హులకే టికెట్‌ ఇవ్వాలని భాజపా పెద్దలను కోరుతున్నట్లు చెప్పారు.

కనీసం తనకు మొదటి జాబితాలో టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో అన్న విషయంలో పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వకపోవడంతో తీవ్రమైన మనోవేదనకు గురైనట్లు తెలిపారు.  ఒకవేళ  రెండో లిస్టులో తన పేరు ఉన్నా.. తాను మాత్రం పోటీ చేయనని స్పష్టం చేశారు. పార్టీలో తనకు అవమానాలు జరిగాయని, ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
చదవండి: రాజయ్య ఆవేదన కడియంకి మైనస్ అవుతుందా?

#

Tags : 1

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)