Breaking News

కాంగ్రెస్ పార్టీకి చురకలంటించిన ఆ పార్టీ సీనియర్ నేత

Published on Wed, 08/23/2023 - 13:41

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. హిందూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ నేతలు హిందూత్వ మంత్రాన్ని జపిస్తుండటంపై ఆ పార్టీ సీనియర్ నేత అజీజ్ ఖురేషి తమ పార్టీపైనే విమర్శలు చేయడం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.  

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఇటీవల కాలంలో ఎక్కువగా హిందూ దేవాలయాలను సందర్శిస్తూ హిందుత్వ అస్త్రాన్ని ప్రయోగించడాన్ని తప్పుబట్టారు సీనియర్ కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషి(82). మంత్రిగానూ, ఎంపీగానూ, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ గానూ సేవలందించిన అజీజ్ ఖురేషీ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని మీరు చెప్పిందల్లా చెయ్యడానికి  ముస్లింలు మీ బానిసలు కాదని. కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. 

పోలీస్ శాఖలోనూ, రక్షణ శాఖలోనూ, బ్యాంకుల్లోనూ ముస్లింలకు ఉద్యోగాలు రావు, వారికి కనీసం బ్యాంకు లోనులు కూడా రావు.. అలాంటప్పుడు మీకు ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు. ముస్లింల ఇళ్ళు, దుకాణాలు, మందిరాలు తగలబెడుతూ వారి పిల్లలను అనాధలుగా చేస్తుంటే చూస్తూ ఉంటారనుకోకండి. వారేమీ పిరికివారు కాదు. 22 కోట్ల మందిలో 2 కోట్లు మంది ప్రాణాలర్పిస్తే పోయేదేమీ లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ లీడర్లు గురించి మాట్లాడుతూ.. ఈ మధ్య వారు కొత్తగా హిందూత్వ మంత్రాన్ని జపిస్తున్నారు. పార్టీ ఆఫీసుల్లో దేవుళ్ళ ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల కోసం దిగజారడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. 

దీనిపై కాంగ్రెస్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ అది ఆయన అభిప్రాయమని కాంగ్రెస్ ఎప్పుడూ లౌకికవాదాన్ని విశ్వసిస్తుందని అన్నారు. ఇక బీజేపీ నేత నరేంద్ర సాలూజ అజీజ్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి మైరిటీలను బుజ్జగించే రాజకీయాలు అలవాటేనని రాహుల్ గాంధీ, కమల్ నాథ్ సహా కాంగ్రెస్ నాయకులంతా ఎన్నికల నేపథ్యంలో హిందువుల అవతారం ఎత్తుతారని మధ్యప్రదేశ్‌లో ఉండే 82 శాతం హిందూ ఓటర్లను ప్రభావితం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని ఆయన అన్నారు. చేతనైతే ఖురేషీ అడిగిన దానికి సమాధానం చెప్పాలని అన్నారు.   

ఇది కూడా చదవండి: మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది మృతి

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)