Breaking News

యువ భారత్‌కు వయసు మళ్లిన ఎంపీలు!

Published on Fri, 04/26/2024 - 13:11

భారత్‌ యువ దేశం.. మొత్తం జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వాళ్లే. సగటు వయస్సు 29 కంటే తక్కువ ఉన్నందున భారత్‌ను యువ దేశం అని పిలుస్తారు. దేశమయితే యువతది కానీ.. పరిపాలిస్తున్నవారు మాత్రం వయసు మల్లినవారు. గత 20 ఏళ్లలో ఎన్నికైన ఎంపీల సగటు వయసును పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.

ఇప్పటివరకూ 17 లోక్‌సభలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1999లో 13వ లోక్‌సభ నుంచి 2019లో 17వ లోక్‌సభ వరకూ ఎన్నికైన ఎంపీల సగటు  వయసు 50 ఏళ్లు దాటింది. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీలైనవారి సగటు వయసు అయితే ఏకంగా 55 ఏళ్లకు చేరడం గమనార్హం. ఎంపీగా పోటీ చేయడానికి భారత రాజ్యాంగం నిర్దేశించిన వయసు 25 ఏళ్లే అయినా ఎన్నికవుతున్న ఎంపీల సగటు వయసు 55 ఏళ్లు తాకింది. ఎంత ఎక్కువ మంది వయసు మళ్లినవారు ఎంపీలుగా ఎన్నికవుతున్నారంటే అంత ఎక్కువగా యువత ప్రాతినిధ్యం తగ్గుతోందని అర్థం.

17వ లోక్‌సభకు ఎన్నికైన అత్యంత పెద్ద వయస్కుడైన ఎంపీ షఫీకర్‌ రెహ్మాన్‌ బార్క్‌. ఈయన ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇక ఇదే లోక్‌సభలో అత్యంత పిన్నయస్కురాలైన ఎంపీ చంద్రాని ముర్ము. ఒడిశాలోని కియోంజార్‌ స్థానం నుంచి ఈమె గెలుపొందారు. 

2011 జనాభా లెక్కల ప్రకారం, భారతీయ జనాభాలో దాదాపు 11 శాతం మంది 25-30 ఏళ్ల వయస్సులో ఉన్నారు. 2019 లోక్‌సభలో, ఈ వయస్సులో 1.5 శాతం మంది ఎంపీలు కూడా లేరు. 2011 జనాభా గణన కూడా భారతీయ జనాభాలో 25 శాతం కంటే ఎక్కువ మంది 25-40 ఏళ్ల వయస్సులో ఉన్నారని చెబుతోంది. అయితే ఈ ఏజ్‌ గ్రూపు 17వ లోక్‌సభలో కేవలం 12 శాతం మాత్రమే. ఈసారి 18వ లోక్‌సభలో అయినా యువత ప్రానిధ్యం మెరుగుపడుతుందేమో చూడాలి.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)