Breaking News

ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం నేడే

Published on Sat, 09/21/2024 - 08:58

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సీనియర్‌ నాయకురాలు అతిషి ఇవాళ (శనివారం) ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సీఎంగా అతిషితో సహా ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు.. ఢిల్లీ సీఎంగా అతిశి నియామకం సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అతిషి సీఎం నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేసింది.  ఇక.. ఇవాళ జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇటీవల ఢిల్లీ సీఎంగా రెండు రోజుల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రకటించిన విధంగానే ఆయన రాజీమానా చేసి.. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా సీనియర్‌ నాయకురాలు అతిషిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ముందు ఆమెను శాసనసభా పక్షనేత ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణస్వీకార తేదీని ప్రతిపాదిస్తూ.. లెఫ్టినెంట్‌ గరర్నర్‌ (ఎల్జీ) వీకే సక్సేనాకు లేఖ అందజేశారు. ఇక.. ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం కానున్నారు. ఆమె ఢిల్లీకి మూడో​ మహిళా  ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేయనున్నారు.​

 

చదవండి: ప్రభుత్వ సలహాదారు నుంచి ప్రభుత్వాన్నే నడిపించేదాకా..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)