Breaking News

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేను: బీజేపీ ఎంపీ అభ్యర్థి

Published on Sun, 03/03/2024 - 15:46

న్యూఢిల్లీ: బీజేపీ తొలి జాబితాలో పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్ సెగ్మెంట్‌ అభ్యర్థిగా ప్రకటించబడిన భోజ్‌పూరి నటుడు, గాయకుడు పవన్‌ కుమార్‌ సింగ్ తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ‘నాపై బీజేపీ అధినాయకత్వం  పూర్తి నమ్మకంతో నాకు అసన్‌సోల్‌ నియోజకవర్గం సీటు కేటాయించింది. కానీ, నేను పోటీ చేయలేను. కొన్ని కారణాల వల్ల నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’ అని పవన్‌ కుమార్‌ సింగ్ ‘ఎక్స్’ (ట్విటర్‌) వేదికగా ప్రకటించారు.

బిహార్‌కు చెందిన పవన్‌ కుమార్‌ సింగ్‌ను బెంగాల్‌లోని అసన్‌సోల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ పోటీకి దించటంపై పెద్ద ఎత్తున దుమారం రేపింది.  బెంగాలీ మహిళలపై అభ్యంతరకరమైన పాటలను రూపొందించినట్లు ఆయనపై సోషల్‌ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో పవన్‌కుమార్‌ అభ్యర్థిత్వం  వల్ల అసన్‌సోల్‌ నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని బీజేపీ ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. అంతలోనే పవన్‌కుమార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించటం గమనార్హం.

బీజేపీ తొలి జాబితాలోనే పశ్చిమ బెంగాల్‌లో 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన 20 మందిలో అసన్‌సోల్ సెగ్మెంట్‌ నుంచి పవన్‌ కుమార్‌ సింగ్‌కు అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్టానం. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇలా.. పోటీ నుంచి పవన్‌ కుమార్‌ వైదొలుగుతున్నట్లు ప్రకటించటంపై బెంగాల్‌ బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్‌ నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు.

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)