Breaking News

‘జమిలి’తో సామాన్యులకు లాభమేంటి?

Published on Mon, 09/04/2023 - 05:50

చండీగఢ్‌:  ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని ఆమ్‌ ఆద్మీ పారీ్ట(ఆప్‌) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ చెప్పారు. జమిలి ఎన్నికల వల్ల సామాన్య ప్రజలకు ఉపయోగం ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం హరియాణాలోని భివానీలో ఎన్నికల ప్రచార సభలో కేజ్రివాల్‌ ప్రసంగించారు. ఏదో ఒక రోజు బీజేపీని ఆమ్‌ ఆద్మీ పార్టీ దేశం నుంచి తుడిచిపెట్టేస్తుందని అన్నారు. ఒకే దేశం–ఒకే ఎన్నిక అవసరం లేదని, ఒకే దేశం–ఒకే విద్య కావాలని ఆకాంక్షించారు.

ధనవంతులకు, పేదలకు ఒకేరకరమైన విద్య అందించాలన్నారు. ఒకే దేశం–100 ఎన్నికలు, ఒకే దేశం–1,000 ఎన్నికలు అయినా సామాన్య ప్రజలకు పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలు అవసరం లేదని తేలి్చచెప్పారు. ఉచిత పథకాలు అంటూ కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పేదలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించడం నేరమా? పాపమా? అని ప్రశ్నించారు. హరియాణాలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేజ్రివాల్‌ మండిపడ్డారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)