Breaking News

బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్‌

Published on Fri, 01/17/2025 - 20:04

న్యూఢిల్లీ:బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోపై ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌)అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. బీజేపీ మేనిఫెస్టోలోని హామీలన్నీ తమ నుంచి కాపీ కొట్టినవేనని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి బీజేపీకి విజన్‌ లేదని అర్థమవుతోందన్నారు. ఇక ప్రజలు ఇలాంటి విజన్‌ లేని పార్టీని ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు.

‘గతంలో పీఎం మోదీ ఉచితాలు మంచివి కావన్నారు. ఇప్పుడేమో బీజేపీ మా ఉచిత పథకాలన్నీ కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెడుతోంది. ప్రధాని ఇప్పటికైనా ఉచితాలు మంచివేనని,కేజ్రీవాల్‌ పథకాలు సరైనవేనని ఒప్పుకోవాలి. ఉచితాలు దేవుడు పెట్టే ప్రసాదాలు.కేజ్రీవాల్‌ అమలు చేసిన పథకాలన్నీ కొనసాగుతాయని నడ్డా చెబుతున్నారు. మరి అలాంటప్పుడు మీకెందుకు ఓట్లేయాలి’అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

కాగా, బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం(జనవరి17) ఢిల్లీలో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో బీజేపీ ఢిల్లీ ప్రజలకు కీలక హామీలిచ్చింది. మహిళా సమ్మాన్‌ యోజన పేరిట మహిళలకు నెలనెలా రూ.2500 నగదు, సబ్సిడీపై గ్యాస్‌ సిలిండర్లు, గర్భిణీ మహిళలకు రూ.21వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఇవన్నీ తమ పథకాలేనని కేజ్రీవాల్‌ అంటుండడం గమనార్హం.

ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ, ఆమ్‌ఆద్మీపార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ పోటీలో ఉన్నప్పటికీ అంతగా ప్రభావం చూపబోదనే అంచనాలున్నాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని ఆప్‌ భావిస్తుండగా ఈసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని కృత నిశ్చయంతో బీజేపీ ఉంది. 

ఇదీ చదవండి: బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టోలో కీలక హామీలివే..

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)