Breaking News

ఆప్‌ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్‌ భేటీ

Published on Sun, 02/09/2025 - 19:50

డిల్లీ:   ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Election 2025) గెలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యేలతో ఆ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సమావేశమయ్యారు. దీనికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి సహా గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  ఈ సమావేశంలో ఆప్‌ ఓటమికి సంబంధించిన కారణాలపై ుసుదీర్ఘంగా విశ్లేషించారు. ాపార్టీ భవిష్యత్‌  కార్యాచరణపై కూడా పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్‌ చర్చించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఎవరు అనే అంశంపై ఎటువంటి చర్చ జరగలేదని భేటీ తర్వాత మీడియాకు స్పష్టం చేశారు అతిషి.

ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు..

ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని అతిషి విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా అవినీతే కనిపించిందని ఆమె మండిపడ్డారు. బహిరంగంగా  ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా , మద్యాన్ని కూడా ఏరులై పారించారన్నారు.  దీనికి  ఢిల్లీ పోలీసులే సాక్ష్యమన్నారు అతిషి. పోలీసుల సాక్షిగానే బీజేపీ(BJP)  అక్రమాలకు పాల్పడిందన్నారు.  ఇందులో  పోలీసులదే ప్రధాన పాత్ర అయితే ఇంకెవరికి  చెప్పుకుంటామని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తప్పు చేసిన వాళ్లు పోలీసులే అయితే ఇక జైల్లో  ఎవరిని పెడతారన్నారు. ఢిల్లీ  ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని ఆమె దుయ్యబట్టారు.

కాగా, నిన్న(శనివారం) వెలువరించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లతో అధికారాన్ని కైవసం ేచేసుకుంటే, ఆప్‌ 22 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. రెండు పర్యాయాలుగా ఢిల్లీ పీఠాన్ని సాధిస్తూ వస్తున్న ఆప్‌.. ఈసారి ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది.ఆప్‌ నుంచి పోటీ చేసిన కీలక నేతల్లో అతిషి మినహా మిగతా వారు ఓటమి చెందారు. కేజ్రీవాల్‌,  మనీష్‌ సిసోడియాలు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి చెందడం ఆ పార్టీకి గట్టి ఎదురుబెబ్బ తగిలినట్లయ్యింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)