Breaking News

ఇండియా కూటమికి ఎదురుదెబ్బ.. ఆప్ కీలక నిర్ణయం

Published on Mon, 08/28/2023 - 07:51

ఢిల్లీ: ఇండియా కూటమి ఐక్యతను దెబ్బతీసేలా!.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్ సమావేశం నిర్వహించారు. 2025లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ నెలఖరున ముంబయిలో ఇండియా కూటమి నిర్వహించనున్న కీలక సమావేశానికి ముందు ఆప్ నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.   

బిహార్‌లో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని సందీప్ పాఠక్ నాయకులకు సూచించారు. నీచరాజకీయాల కారణంగానే బిహార్‌ ముందుకు పోవడం లేదని ఆరోపించారు. ఆప్ తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అంతకుముందే పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకులను కోరారు. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ బిహార్ ఇంఛార్జీ అజేష్ యాదవ్‌లు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.  

గుజరాత్‌లో మాదిరిగానే బిహార్‌లోనూ పూర్తి స్థాయిలో పోటీ చేస్తామని పాఠక్ అన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయగానే తదుపరి ప్రణాళికలను వెల్లడిస్తామని చెప్పారు. బిహార్‌లో పంచాయతీ ఎన్నికల్లో మొదట పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దేశం కఠిన సమయంలో ఉందని పాఠక్ అన్నారు. ప్రధాని మోదీ ఈ తొమ్మిదేళ్లలో ప్రసంగాలు ఇవ్వడం తప్పా.. ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని దుయ్యబట్టారు. 

ఇండియా కూటమి పరిస్థితిపై ప్రశ్నించినప్పుడు.. 'పార్టీల అభిప్రాయాలు వేరు.. దేశమే ప్రధానం.. కూటమిలు తర్వాత' అని పాఠక్ చెప్పారు. ఆప్ జాతీయ పార్టీ.. ఎక్కడైనా పోటీ చేయవచ్చని అన్నారు. 

జేడీయూ, ఆర్జేడీ రియాక్షన్..
ఆప్ నిర్ణయంపై ఆర్జేడీ నాయకుడు, ఎంపీ మనోజ్ స్పందించారు. 'ఇండియా కూటమిని నిర్మించేప్పుడే కొన్ని కట్టుబాట్లను పెట్టుకున్నాం. ఈ విధివిధానాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆప్ కూటమి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి'అని ఆయన సూచించారు. 

పార్టీని విస్తరించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని జేడీయూ నాయకుడు నీరజ్ కుమార్ అన్నారు. తాము కూడా ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తామని చెప్పారు. కూటమి పార్టీలన్నీ ఏకంగా పోటీచేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా ఇతర నాయకులు చెప్పారు. అంతర్గత అభిప్రాయ భేదాలు క్రమంగా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.  

ఇదీ చదవండి: మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ నోట బ్రియాన్ డి ఖర్ప్రాన్‌ పేరు.. ఎవరీయన?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)