Breaking News

ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్‌

Published on Sun, 07/14/2024 - 10:54

చెన్నై : పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం మరణించాడు.  

శనివారం సాయంత్రం చెన్నై పోలీసులు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కోసం నిందితుడు తిరువేంగడం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు నిందితుణ్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ లభ్యమైన గన్‌తో నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.అత్యవసర చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. నిందితుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని చెన్నై పోలీస్‌ అధికారులు తెలిపారు.  

కొద్ది రోజుల క్రితం బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ దారుణహత్యకు గుయ్యారు. చెన్నై పెరంబూర్‌లో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. అక్కడికి వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తితో దాడిచేసి పారిపోయారు.స్థానికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం థౌజండ్‌లైట్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఈ దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ముఖ్యంగా బలహీన వర్గాలు సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వం సీరియస్‌గా ఉంటే, నిందితులను అరెస్టు చేసి ఉండేవారు. అది లేదు కాదు కాబట్టి కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని ఆమె అన్నారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)