Breaking News

‘నితీష్‌- మమత.. నింగి-నేల’ ఆప్‌ నేత ఎందుకన్నారు?

Published on Sun, 04/07/2024 - 11:15

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది, బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్‌- మమతలను నింగి-నేలతో పోల్చారు.

2024 లోక్‌సభ ఎన్నికల కోసం  ఆప్‌ సాగిస్తున్న ప్రచారం గురించి కూడా సంజయ్ సింగ్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 23 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోందని, కార్యకర్తలంతా పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. ఇండియా కూటమిని వీడి ఎన్‌డీఏలో చేరిన బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై సంజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ కుమార్ నిష్క్రమణ అనూహ్యమని, విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆయన హఠాత్తుగా ఎన్డీఏలో చేరారన్నారు. ఈ విధంగా  పార్టీలు మారితే స్వల్పకాలంలో అధికారాన్ని, ప్రయోజనాన్ని పొందవచ్చని, తరచూ పార్టీలు మారితే చరిత్ర హీనులవుతారని ఆరోపించారు. ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడి, ఇప్పుడు దానికి నితీష్‌ తలొగ్గుతారని తాను భావించలేదన్నారు. 

ఇక మమతా బెనర్జీ విషయాని కొస్తే ఆమె బీజేపీకి వ్యతిరేకంగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్నారని సంజయ్ సింగ్ అన్నారు. అందుకే మమతకు నితీష్ కుమార్‌కు మధ్య  నింగికి నేలకు ఉన్నంత తేడా ఉన్నదన్నారు. మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుండగా, నితీష్ కుమార్ బీజేపీకి సాగిలపడ్డారని ఆరోపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఇండియా కూటమికి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)