మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి
Breaking News
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ఓటు వేయనివాడికి పథకాలు ఎందుకివ్వాలి ?
Published on Mon, 07/13/2026 - 08:24
విశాఖపట్నం: ఓటు వేయని వాడికి సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి? అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విశాఖ రుషికొండలో ఆదివారం ఒక పుస్తకావిష్కరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటరు లిస్టులో పేరు లేకుంటే.. ఆ ఓటరు చచ్చిపోయినట్లేనని, పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటు వేయనివాడికి పథకాలు ఎందుకివ్వాలని ప్రశ్నించారు.
ఓటరు లిస్టులో పేరు ఉందో.. లేదో.. తెలియని వాడికి కూడా పథకాలివ్వాలా అంటూ.. ఆవేశంతో ఊగిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ అధికారులను పంపించి ఓటు నమోదు చేసుకోవడమేంటి.. మీరు ఓటు నమోదు చేసుకోలేరా? ఆ బాధ్యత మీకు లేదా.. అంటూ అయ్యన్నపాత్రుడు నిలదీశారు.
#
Tags : 1