Breaking News

ఏం మంత్రులయ్యా మీరు?: స్పీకర్‌ అయ్యన్న చురకలు

Published on Thu, 09/18/2025 - 10:37

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడికి మళ్లీ కోపమొచ్చింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో ఆయన మంత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏం మంత్రులయ్యా మీరు అన్నరీతిలో చురకలంటించారాయన.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే.. మంత్రుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేస్తున్న సమయంలో.. మంత్రులు ఏం పట్టనట్లు చూస్తూ ఉండిపోయారు. అయితే ఎమ్మెల్యేల ప్రశ్నలను నమోదు చెయ్యని మంత్రులు, అధికారులపై స్పీకర్‌ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యేలు మాట్లాడితే ఒక్క మంత్రి కూడా నోట్ చేసుకోరా?. గతంలో ఉన్న సంప్రదాయం ఇప్పుడెందుకు లేదు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. జీరో అవర్ లో మాట్లాడిన ప్రశ్నలకు కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఇలా అసహనం.. ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్తేం కాదు. గతంలో కూటమి ఎమ్మెల్యేలు తమ అనుచరుల్ని అసెంబ్లీకి తోలుకుని రావడంపై, అలాగే మంత్రులు ఆలస్యంగా రావడం.. క్వశ్చన్‌ అవర్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడంపైనా ఆయన మందలింపు వ్యాఖ్యలు చేశారు.

	ఎమ్మెల్యేలు మాట్లాడితే ఒక్క మంత్రి కూడా నోట్ చేసుకోరా అంటూ స్పీకర్ అసహనం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)